మూడు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం
Congress: మూడు జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూచాడి శ్రీహరి రావు, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అందె సంజీవరెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో శ్రీహరి రావు క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేశారు. దీంతో ఆయనకు బీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పారు. వాటిని సైతం ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏకఛత్రాధిపత్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన అనుచరులను పట్టించుకోవడంలేదని కినుక వహించిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో తమకు సరైన స్థానం దక్కడం లేదని అధిష్టానంపై కోపంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో పార్టీని నడిపిన అనుభవం, పార్టీ చీఫ్ అండదండలు ఉండంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వరించింది.