జర్నలిస్టులు అందరికీ ఇండ్ల పట్టాలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్

Balka Suman:జిల్లాలో జర్నలిస్టులు అందరికీ ఇండ్ల పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల పట్టాలకు సంబంధించి తనను కలిసిన టీయూడబ్ల్యుజే (హెచ్ 143) ప్రతినిధులతో మాట్లాడారు. కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు సైతం దీనికి సంబంధించి సూచనలు చేశారు. జర్నలిస్టుల్లో ఎక్కువ మంది అద్దె ఇంట్లో ఉంటున్నారని, వారికి సొంత స్థలాలు కేటాయించి సొంత ఇండ్లలోకి వెళ్లేలా చూస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షమానికి జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇండ్ల పట్టాలకు సంబంధించి కలెక్టర్ ద్వారా ఫైల్ పంపితే తాను కమిషనర్ నవీన్ మిట్టల్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ సైతం జర్నలిస్టుల ఇండ్ల పట్టాలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో (టీయూడబ్ల్యు జే హెచ్ 143) నేతలు దాసరి ఉమేష్, కోల అరుణ్‌కుమార్, వికాస్ యాదవ్, కోల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.