గని ప్రమాదంలో కార్మికుడు దుర్మరణం
మరొకరికి గాయాలు

Singareni: బొగ్గు గని ప్రమాదంలో కార్మికుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. రామగుండం ఏరియా జీడికే లెవన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి రెండవ షిఫ్ట్ విధులు ముగించుకునే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బొగ్గు గనిలో జె.ఎం.ఎస్ అనే ప్రైవేట్ కంపెనీలో ఆపరేటర్ గా పని చేసే కృష్ణమురారి పైకప్పు కూలి మెడపై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యల వైఫల్యంతోనే ఈ సంఘటన జరిగిందని తోటి కార్మికులు, కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీ కృష్ణా నగర్ కు చెందిన కృష్ణ మురారి కి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో తరలించారు. ఈ సంఘటనపై సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బీఎంఎస్ రాష్ట్ర నాయకులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.