నిర్మల్లో లాఠీఛార్జీ

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు శనివారం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తక్షణమే నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళన చేయవద్దని పోలీసులు చెప్పినా వినకపోవడంతో వాగ్వావాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే తోపులాట జరిగింది. రాస్తారోకో చేస్తున్న నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు బలవంతంగా బీజేపీ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు.