అన్ని ఖర్చులు భరిస్తా.. అండగా ఉంటా…

Durgam Chinnayya: నీ వైద్య విద్యకు అయ్యే అన్ని ఖర్చులు భరిస్తా.. అండగా ఉంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ వైద్య విద్యార్థికి హామీ ఇచ్చారు. తాండూర్ మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి రుతీష్ కు సూర్యపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS సీటు వచ్చింది. అయితే, పేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్నయ్య అతనికి ఖర్చుల కింద తక్షణ సాయంగా రూ. 20వేలు అందించారు. రుతీష్ వైద్య విద్యకు అయ్యే అన్ని రకాల ఖర్చులు తానే స్వయంగా భరిస్తానని, సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు..