ఆదిలాబాద్‌లో భారీ చోరీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 78 తులాల బంగారం తో పాటు 20 తులాల వెండి 20.000 వేల రూపాయల నగదు దొంగతనం చేశారు. దుండగులు రెండు వాహనాల్లో వచ్చి రెండిళ్ల తలుపులు పగలగొట్టారు. రాంనగర్లో శ్రీ సాయి రెసిడెన్షిలో అపరమెంట్ లో నాగరాజు అనే వ్యక్తి ఫ్లాట్‌తో పాటు మరో వ్యక్తి ఫ్లాట్లో ఈ భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. చోరీ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు.సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దొంగల కోసం రెండు బృందాలు గా గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.