BMS కార్మిక పక్షపాతి యూనియన్
BMS:భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) కార్మికుల కోసం అహర్నిశలు పనిచేస్తుందని, అది కార్మిక పక్షపాతి అని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం భూపాలపల్లిలో ఆ యూనియన్ బ్రాంచి ఆఫీసు భూమి భవన నిర్మాణ పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సింగరేణి కార్మిక వర్గ హక్కుల కోసం ఈ BMS ఆఫీసు వేదిక కానుందన్నారు. కార్మిక ప్రయోజనాల కోసం బీజేపీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులు కూడా BMS ఆఫీసును సద్వినియోగం కోసం వాడుకోవాలని కోరారు.
ఈ పూజా కార్యక్రమంలో BMS బ్రాంచి ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, రమాదేవి రేణికుంట్లమల్లేష్ వరలక్ష్మి, ఈర్ల సదానందం, మల్లిక, బోయిన వెంకటస్వామి, సునీత, రంగనాయకుల జనార్దన్, పద్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో BJP రాష్ట్ర నాయకులు వెన్నంపల్లి పాపయ్య, ఎరకల గణపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మధుసూదన్, పట్టణ అధ్యక్షుడు తొంగల రాజేందర్, OBC BJP జిల్లా అధ్యక్షుడు నాంపల్లి కుమార్, జైపాల్, BMS నాయకులు వెలబోయిన సుజేందర్, బ్రాంచి కార్యదర్శి కొండపాక సాంబయ్య, R నర్సింగరావు పండ్రాల మల్లేష్, గట్ల మల్లారెడ్డి, కడారి శంకర్., రఘుపతిరెడ్డి, ఓరం లక్ష్మణ్, పని రమేష్, MD. యూసుఫ్, M దామోదర్ రావు, అల్లం శ్రీనివాస్, సరోత్తం రెడ్డి,తాండ్ర మొగిలి, మారం లక్ష్మణ్, రసకట్ల సాగర్ కార్యకర్తలు పాల్గొన్నారు.