చంద్రబాబు నాయుడు అరెస్టు

Chandrababu Naidu:టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో బాబును సిట్, సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా, కోర్టులో కేసు విచారణ జరుగుతన్న సమయంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. కేసు పేపర్లు ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని లాయర్లు కోరగా.. రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదని పోలీసులు తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.
నంద్యాల పర్యటనలో ఉన్న బాబు ఆర్.కె ఫంక్షన్ హాల్‌లో బస చేశారు. శుక్రవారం రాత్రి బస చేసిన ప్రాంతానికి డీఐజీ రఘురామిరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డితోపాటూ ఇతర పోలీస్ అధికారులు అక్కడికి వచ్చారు.. అప్పటి నుంచి హైడ్రామా నడిచింది. అయితే చివరికి టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు. టీడీపీ అధినేతను ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది క్లారిటీ రాలేదు.