కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Congress:రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని అందరూ సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ టీఎస్ఆర్టీసీ కళాభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు. కాంగ్రెస్ ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేసున్నాయని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే క్షేత్ర స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ల నియామకం జరగాలన్నారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేది బూత్ లెవెల్ ఏజెంట్లేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ జెండాను మోసే నిఖార్సైన కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించుకుందామని నేతలకు పిలుపునిచ్చారు. రాబోయే వంద రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించాలని ఆయన కోరారు.
టీఆర్ఎస్ పాలనలో కార్యకర్తలు అనేక కష్టాలు నష్టాలు పడుతున్నారని మనమంతా ఐక్యమత్యంతో పని చేస్తే వచ్చేది మన ప్రభుత్వమేనన్నారు. పదేళ్లలో తెలంగాణను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీ ఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమవేశానికి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి రొడ్డ శారద, నాతరి స్వామి, కాంపల్లి ఉదయ్ కాంత్, గద్దల హైమావతి, టీపీసీసీ ఒబిసీ సెల్ రాష్ట్ర నాయకులు బండి ప్రభాకర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్, సిలువెరు సత్యనారాయణ, ఎంఏ నహీం కొమ్ము రాజన్న, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, డిసిసి మెంబర్ గట్టు బాణేష్, బెల్లంపల్లి మహిళా టౌన్ ప్రెసిడెంట్ మీనుగు సరోజ, తాండూరు మండల అధ్యక్షుడు సూరం దామోదర్ రెడ్డి, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు బాకం మల్లేష్, కాజీపేట మండల అధ్యక్షుడు వేముల కృష్ణ, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కె శ్రీనివాస్, ఆడెపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.