జైలుకు చంద్ర‌బాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుయుడుకు రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు న్యాయమూర్తి హిమబిందు తీర్పు వెలువ‌రించారు.ఆయ‌న‌ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించ‌నున్నారు.శ‌నివారం ఉద‌యం ఆయ‌న‌ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. చంద్రబాబును సిట్ అధికారులు నిన్న సాయంత్రం కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తీసుకురాగా, దాదాపు 12 గంటల అనంతరం ఆదివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం తెల్లవారి 3 గంటల వరకూ ఈ విచారణ సాగింది. మధ్యలో కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబుని భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, బాలకృష్ణ, బ్రాహ్మణి కలిసి మాట్లాడారు. తెల్లవారు జామున 3 గంటలకు సిట్ ఆఫీసులో విచారణ ముగిసింది. తర్వాత చంద్రబాబును విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 3.30కి ఆయన ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు దాదాపు 45 నిమిషాలపాటూ వైద్య పరీక్షలు జరిపారు. ఏ టెస్టులు చేసిందీ చెప్పని డాక్టర్లు, రొటీన్ టెస్టులు చేశామని అన్నారు. వైద్య పరీక్షల అనంతరం కొన్ని సంతకాల కోసం అంటూ చంద్రబాబును మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన ఏసీబీ అధికారులు… కాసేపటి తర్వాత ఏసీబీకి కోర్టుకు తీసుకెళ్లారు. శ‌నివారం ఉద‌య‌మం చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు 24 గంటల సమయం పూర్తి కావొస్తుందనగా ఆయనను ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు.

ఆయ‌న‌ను కోర్టుకు తీసుకువ‌చ్చే స‌మ‌యానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వం, సీఐడీ తరఫున ఏఏజీ పీ.సుధాకర్‌ రెడ్డి, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున టీడీపీ న్యాయవాదులు సైతం త‌మ వాద‌న‌లు వినిపించారు. ఢిల్లీ నుంచి ప్ర‌త్యేకంగా వ‌చ్చిన సిద్దార్థ లూథ్రా అనే సుప్రీం కోర్టు లాయ‌ర్ సైతం వాద‌న‌లు వినిపించారు. చంద్ర‌బాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like