పెండ్లి రోజునే జైలుకి…
Chandrababu Naidu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెండ్లి రోజునే జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. పెళ్లి రోజును ఎంతో ఆనందంగా కుటుంబసభ్యులు, అభిమానుల మధ్య జరుపుకోవాలని చంద్రబాబు దంపతులు అనుకున్నప్పటికీ.. తాజాగా పరిణామాలతో అటు సిట్ కార్యాలయం.. ఇటు కోర్టులోనే గడిచిపోయింది. భువనేశ్వరి, చంద్రబాబు పెండ్లి 10 సెప్టెంబర్ 1981 రోజున వివాహం చేసుకున్నారు.నాడు ఏపీ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నందమూరి భువనేశ్వరి వివాహం చెన్నైలో జరిగింది.పెండ్లి రోజునే జైలుకు వెళ్లడం పట్ల భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబునాయుడుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో సతీమణి భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. ఏసీబీ కోర్ట్ హాలుకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూసిన ఆమె ఒక్కసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. వివాహ వార్షికోత్సవం రోజే చంద్రబాబును జైలుకు తరలిస్తుడటంతో టీడీపీ వర్గాలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.