అధికారుల వేధింపులు నశించాలి
INTUC ఆధ్వర్యంలో పోస్టర్లు
INTUC :సింగరేణి మందమర్రి ఏరియా కాసిపేట 1 గనిలో అధికారులు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని అవి ఆపేయాలని కార్మిక సంఘం INTUC వేసిన వాల్ పోస్టర్స్ కలకలం సృష్టించాయి. శ్రమదానం పేరిట సర్ఫేస్ లో పనిచేయించి అండర్ గ్రౌండ్లో వేరే పని కేటాయిస్తున్నారని, మ్యాన్ రైడింగ్ ఆఫ్ చేయడంతో కార్మికులు కాలి నడకనే పని స్థలాలకు చేరుకోవడానికి నరకయాతన అనుభవిస్తున్నారని అందులో దుయ్యబట్టారు. శ్రమదాన కార్యక్రమాన్ని నిలిపివేయాలని మ్యాన్ రైడింగ్ నడిచే సమయాన్ని పొడిగించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సెలవులు మంజూరు చేయకుండా వేదింపులకు పాల్పడడం వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అధిక పనిభారాన్ని మోపడం వల్లనే కార్మికుల గైర్హాజరు శాతం పెరుగుతున్నదని దుయ్యబట్టారు. అందుకే అధిక పనిభారాన్ని మోపే చర్యలను వెంటనే నిలిపివేయాలని అందులో కోరారు. క్రిందిస్థాయి అధికారులు, సూపర్ వైజర్లపై గని మేనేజర్ అహంకార పూరిత ధోరణి నశించాలని స్పష్టం చేశారు.
ట్రేడ్ మెన్ కార్మికులు, సూపర్ వైజర్లకు ఈ సంవత్సరం 180 మస్టర్లు లేకపోతే వారిని వారి కుటుంబాలతో సహా కౌన్సిలింగ్ కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పిష్ట సమయం ముగిసిపోయినా కార్మికులతో పని చేయించే దారుణ చర్యలను వెంటనే మానుకోవాలన్నారు. తమకు నచ్చిన వారికే ప్లేడే లు ఇచ్చే విష సంస్కృతికి వెంటనే చరమగీతం పాడాన్నారు. ఎస్.డి.ఎల్. బండ్ల మెంటనెన్స్ పేరుతో ఫిట్టర్ మరియు ఎలక్ట్రిషన్నపై మోపుతున్న అధిక పనిభార విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన పనిముట్లను కోల్ కట్టర్లు, ఇతర కార్మికులకు సకాలములో అందజేయాలని కోరారు. ప్రమాదాల బారిన పడ్డ కార్మికులకు సంబంధించిన సెకండ్ రిపోర్టు అధికారులు తప్పక పంపించాలని కోరారు. లాంగ్ స్టాండింగ్ అధికారులను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.