ఖానాపూర్ మండలంలో ఉద్రిక్తత
BRS Vs BJP: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో బీఅర్ఎస్ బీజేపీ నేతల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది.
బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ వినాయక మండపాల సందర్శనకు వెళ్ళారు. దీంతో ఆయనను రాజురా మాజీ ఎంపిపి వర్గం అడ్డుకుంది. జాన్సన్ నాయక్ తన వాహనాన్ని రోడ్డుపై అడ్డుగా పెట్టాడంటూ బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా, జాన్సన్ నాయక్ వాహనాన్ని రాజురా మాజీ ఎంపిపి భర్త వాహనంతో ఎదురుగా ఢీ కొట్టారు. దీంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ వాతారణం చోటు చేసుకుంది.
రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు . బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ఆదేశాలతో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ రాజురా గ్రామంలో బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.
దీంతో ఖానాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద బిజేపి నాయకుల నిరసన వ్యక్తం చేశారు. ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో యువకులపై లాఠీఛార్జ్ చేయడాన్ని బిజేపి నేతలు ఖండించారు. బీజేపీ నాయకులు పోలీస్టేషన్ ముందు సిఐతో వాగ్వవాదానికి దిగారు. సిఐ గదిలోకి ప్రవేశించేందుకు బీజేపి నాయకుల ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ కిటికీ అద్దాలు పగిలాయి. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. సిఐ తీరుపై నేడు ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలకి బిజెపి నాయకులు పిలుపునిచ్చారు.