మాదారం టౌన్షిప్లో మహా అన్నదానం
తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్నదానం మించిన దానం మరోటి లేదని కొనియాడారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప కార్యక్రమమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకొని సమజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారు. సనాతన ధర్మాన్ని, మానవత విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. యువత మంచి మార్గంలో నడవాలని సూచించారు. అన్నదానం నిర్వహించిన కమిటీ సభ్యులు, కత్తెర్ల ఎర్రయ్య, రవీందర్‌ను పలువురు అభినందించారు.