ఘనంగా వినాయకుడి పూజలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో వినాయకుడి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నదానాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మంగళవారం మంచిర్యాల ఐబీ ఏరియా మోర్ మార్కెట్ వద్ద లక్ష్మీబాలాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పండుగలు ఆధ్యాత్మిక వాతావరణంలో చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎడ్ల దామోదర్ పటేల్, కాసర్ల శ్రీనివాస్, గంప శ్రీనివాస్, మల్యాల కుమార్, నులికట్ల మధూకర్, ఉట్టూరి నాగయ్య, గరిగిండి సత్యం, వెంగల్రావు, కేశేట్టి శ్రీనివాస్, జీ. శ్రీనివాస్, కే.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.