మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం

Minister KTR’s visit to Manchiryal: అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, శంకుస్థాపనలు చేయనున్న మంత్రి కేటీఆర్ కు మంచిర్యాల జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఆయన చెన్నూర్ నియోజక వర్గంలో పలు అభివృద్ది,శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, చిన్నయ్య పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. మంచిర్యాల కలెక్టర్ బాదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి ఇతర అధికారులు సైతం మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మందమర్రి మున్సిపాలిటీలో రూ. 500 కోట్లతో మందమర్రి మండలం శంకరపల్లి వద్ద నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీ భూమి పూజ చేశారు.