ఎంసీహెచ్‌లో స్వచ్ఛతా హీ సేవా
మంచిర్యాల మాతా శిశు సంరక్షణా కేంద్రం వద్ద ఆదివారం స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ కేంద్రం చుట్టూ ఉన్న చెత్తా చెదారం, ప్లాస్టిక్ వస్తువులను ఏరివేశారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం నిర్వాహకురాలు శ్రీలత మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడికి చేయగలిగే నివాళి ఏదైనా ఉందంటే అది పరిశుభ్రతే అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహాత్ముడికి నివాళి అర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వీధులను శుభ్రం చెయ్యడం ద్వారా గాంధీజీకి నివాళి అర్పించినట్లేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయ సలహాదారు సుంకరి శైలజ, సోషల్ కౌన్సిలర్లు జ్యోతి, విజయ, వర్కర్లు సుమలత, భారతి, శ్రీకాంత్, డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.