బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
BSP First List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఈ జాబితా విడుదల చేశారు. మొత్తం 20 మందితో ఈ జాబితా విడుదలైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగానే ఆర్ఎస్పీ అక్కడే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసేందుకు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారని, 20 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
బీఎస్పీ అభ్యర్థులు వీరే
1. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – సిర్పూర్
2. జంగం గోపి – జహీరాబాద్
3. దాసరి ఉష – పెద్దపల్లి
4. చంద్రశేఖర్ ముదిరాజ్ – తాండూర్
5. వెంకటేష్ చౌహాన్ – దేవరకొండ
6. కొంకటి శేఖర్ – చొప్పదండి
7. అల్లిక వెంకటేశ్వర్ రావు – పాలేరు
8. మేడి ప్రియదర్శిణి – నకిరేకల్
9. బానోత్ రాంబాబు నాయక్ – వైరా
10. నక్క విజయ్ కుమార్ – ధర్మపురి
11. నాగమోని చెన్నరాములు ముదిరాజ్ – వనపర్తి
12. నిషాని రామచంద్రం – మానకొండూరు
13. పిల్లుట్ల శ్రీనివాస్ – కోదాడ
14. కొత్తపల్లి కుమార్ – నాగర్ కర్నూల్
15. బన్సిలాల్ రాథోడ్ – ఖానాపూర్
16. ముప్పరపు ప్రకాషం – ఆందోల్
17. వట్టె జానయ్య యాదవ్ – సూర్యపేట
18. గొర్లకాడ క్రాంతి కుమార్ – వికారాబాద్
19. ఎర్ర కామేష్ – కొత్తగూడెం
20. ప్రాద్య కుమార్ మాధవరావు ఏకాంబరం – జుక్కల్