చిరకాల వాంఛ.. నెరవేరిన వేళ..

Chennur:చెన్నూరు ప్రాంత ప్రజల కలలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. దశబ్దాల చెన్నూరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. చెన్నూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అదేవిధంగా కోటపల్లి మండలం పారుపల్లిని, చెన్నూరు మండలం ఆస్నాదను నూతన మండలాలుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మందమర్రిలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకులంగా స్పందించిన మంత్రి కేటీఆర్ అక్కడే హామీ ఇచ్చారు. వారం రోజులు కాక ముందే బుధవారం చెన్నూర్ రెవెన్యూ డివిజన్ తో పాటు అన్నారం, పారుపల్లి మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రైతులు భూ సమస్యలతోపాటు ఇతర అవసరాలకు మంచిర్యాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూర్ మండల వాసులు 40 మంచి 60 కిలోమీటర్లు, కోటపల్లి మండల ప్రజలు 80 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. డివిజన్ ఏర్పాటుతో అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరనుంది.
కొత్తమండలంలో గ్రామాలు ఇలా… అస్నాదమండలంలో అన్నారం, గంగారం, కోమ్మెర, పాక్కూర్, పాన్నారం, సోమన్‌పల్లి, నాగపూర్, బీరెల్లి, సుందర శాల, నర్సక్కపేట్, దుగ్నపల్లి..
పారుపల్లిమండంలో పారుపల్లి, ఆయాపల్లి, పుల్లగామ, సిర్సా, ఎదుల్లబంధం, లింగన్నపేట, ఆలుగామ, ఎల్లక్కపేట, బొరంపల్లి, కావర్ కొత్తపల్లి, అన్నారం..