మాజీమంత్రి సెల్ నుంచి అశ్లీల చిత్రాలు

మాజీ మంత్రి గడ్డం వినోద్ సెల్ ఫోన్ నుంచి ఓ గ్రూపులో వచ్చిన అశ్లీల చిత్రాలు, ఓ ఫోటో కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి ఆయన సెల్ ఫోన్ నంబర్ తో సోషల్ మీడియా పోస్టు లు వైరల్ అయ్యాయి. పోర్న్వీడియోలు గ్రూపులో రావడంతో ఆ గ్రూపు సభ్యులు విస్తుపోయారు. కొందరు వ్యక్తులు వాటిని డిలీట్ చేయాలని కోరడంతో ఆ వీడియోలు తీసివేశారు. అయితే, ఆ సెల్ఫోన్ వినోద్ పేరుతోనే ఉన్నా.. అది ఆయన వాడరని సమాచారం. ఎప్పుడైన అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు దానిని తన వాహనంలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. వినోద్ వద్ద పనిచేసే వ్యక్తి తాను ఫోన్ చేసుకుంటానని తీసుకుని వాటిని తనకు పరిచయం ఉన్న వారికి పంపించే సమయంలో పొరపాటుగా గ్రూపుల్లో వచ్చినట్లు తెలుస్తోంది. వినోద్ ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలబడేందుకు టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సెల్ నుంచి పోర్న్ వీడియోలు బయటకు రావడంతో ఆయన ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారు. దీనిపై వినోద్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధవుతున్నారు.