తమ్ముడు దగ్గరుండి పనిచేయించుకుంటడు
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై మంత్రి హరీష్‌రావు ప్రశంసల జల్లు
-మళ్లీ గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని వెల్లడి
Harish Rao: తమ్ముడు బాల్క సుమన్ ఏ పనైనా దగ్గరుండి చేయించుకుంటడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశంసల జల్లు కురిపించారు. సుమన్ ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరుకు నిధుల వరద పారిందని ఈ నియోజకవర్గం దశా,దిశ మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడన్నారు. కేసీఆర్ కు సుమన్ అంటే బాగా ఇష్టం.. సుమన్ ఏది అంటే అది సీఎం ఇస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. సుమన్ చెన్నూర్ లో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా.. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తాడని హరీష్‌రావు వెల్లడించారు. చెన్నూర్ లో రెవెన్యూ డివిజన్ దశాబ్దాల కల సుమన్ తో సాధ్యమైందన్నారు. ఎండను లెక్క చేయకుండా ఇంత మంది జనం వచ్చారంటే సభకు వచ్చినట్లు లేదని విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్లు ఉందని సంతోషం వ్యక్తం చేశారు. చెన్నూర్ అభివృద్ధి ఆగొద్దు అంటే మళ్ళీ బాల్క సుమన్ నే గెలిపించాలని మంత్రి హరీష్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.