దీపావళి బోనస్ రూ. 85,000

Diwali Bonus Rs. 85,000:బొగ్గు గని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ (దీపావళి బోనస్) 85,000 చెల్లించనున్నారు. బోనస్ పెంపుదల గురించి ఈరోజు డిల్లీ లో కోల్ ఇండియా యాజమాన్యం తో జాతీయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ లు పి.ఎల్.ఆర్ బోనస్ ను 1,20,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ యాజమాన్యం 79,500 రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. కాని యూనియన్లు ఒప్పుకోలేదు. చివరకు 85,000 చెల్లించేందుకు అంగీకారం కుదిరింది.