నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణలో ఓట్ల పండుగకు నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు రాష్ట్రంలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణతో పాటు విధానసభ కాల పరిమితి ముగుస్తున్న మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల పోలింగ్ షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది.
నామినేషన్ల ప్రారంభం నవంబర్ 3
నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 10
అసెంబ్లీ పోలింగ్ నవంబర్ 30
అసెంబ్లీ ఫలితాలు డిసెంబర్ 3