తెలంగాణలో ‘నాటు నాటు’ డాన్స్ నడుస్తోంది…
బీఆర్ఎస్,బీజేపీ,ఎంఐఎం దోస్తీపై ప్రియాంకా సెటైర్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అయినా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్‌లో జరిగిన విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కాళేశ్వరం, ఢిల్లీ లిక్కర్ స్కాంపై మోడీ మాట్లాడరని.. కేవలం కాంగ్రెస్ నేతలపైనే ఈడీ, సీబీఐని పంపిస్తారని ఆమె దుయ్యబట్టారు. బీఆర్ఎస్పై పెట్టుకున్న ఆశలు ఒక్కటీ నెరవేరలేదని.. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ప్రధాని మోడీ విధానాలను కేసీఆర్ ఎప్పుడూ వ్యతిరేకించరని.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి నాటు నాటు డ్యాన్స్ వేస్తున్నారని ప్రియాంకా సెటైర్లు వేశారు. వాళ్ల డ్యాన్సులు చూడండి.. కానీ ఓటు వేయొద్దని ఆమె పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు.