అందుబాటులో ఉంటా… అభివృద్ధి చేస్తా…
ప్రజలకు బాండ్ పేపర్ రూపంలో అఫిడవిట్ అందించిన గడ్డం వినోద్

తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, అభివృద్ధి చేసి చూపిస్తానని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని బాండ్ పేపర్ రూపంలో అఫిడవిట్ రూపంలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను గెలిస్తే ఇక్కడ ఉండనని, హైదరాబాద్ వెళ్తానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఇక్కడే ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు పేద ప్రజలకు అందేలా చూస్తానని స్పష్టం చేశారు.
కాగా, బీఆర్ఎస్ ఇతర పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ ఉండడని హైదరాబాద్‌కే పరిమితం అవుతాడని ప్రచారం చేస్తున్నారు. ఆయన గెలిస్తే ఇక్కడి మండలానికి ఒక నేత ఎమ్మెల్యే అవుతాడని దోచుకుంటారని దుయ్యబడుతున్నారు. ప్రజలకు ఏదైనా పని ఉంటే నేతలను పట్టుకుని వారి ఖర్చులు భరించుకుని మరీ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు.