మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ లో చేరిక

బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం ఆమె హైదరబాద్ లో ఎంఎల్ఏ గడ్డం వినోద్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జక్కుల శ్వేతకు అవిశ్వాస గండం పొంచి ఉన్న నేపథ్యంలో ఆమె పార్టీ మారినట్లు సమచారం. బెల్లంపల్లి మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వారే ఉన్నారు. అవిశ్వాసానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లే ఊతమిస్తున్నారు. మెజార్టీ కౌన్సిలర్లు అంతా ఒక్కతాటిపై సమీకరణ అవుతున్నారని సమాచారం. ఎన్నికల సందర్భంగా ఇటీవలనే పలువురు సీనియర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు . అవిశ్వాసానికి కాంగ్రెస్ కౌన్సిలర్లతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేతులు కలుపుతున్నారని సమాచారం.
మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత ను గద్దె దింపడమే లక్ష్యంగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఒక్కటైనట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలో నే శ్వేత పార్టీ మారినట్లు సమచారం. రాజకీయంగా తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాదని కాంగ్రెస్ లో చేరడం సంచలనం కలిగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు రోజులోనే ఆమె పార్టీ మారడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె బీఅర్ఎస్ లో ఉన్న సమయంలోనే ఎమ్మేల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిని కొట్టి పారేశారు.