కేసీఆర్ కు అస్వస్థత
KCR:మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో అయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయనను ఫాం హౌస్ నుండి హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి తరలించారు. యశోద ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.. మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్న డాక్టర్లు.. తనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి అనే విషయంలో డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. అయితే, ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.