త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రమాదవశాత్తు గాయపడ్డ మాజీ సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు.’ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. తిరిగి మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను ప్రస్తావించాలని కోరుకుంటున్నా. కొత్త ప్రభుత్వానికి సలహాలు, సూచనలు కావాలని కోరాం. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించా’నని రేవంత్ వెల్లడించారు.