కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు

Prem Sagar Rao: మంచిర్యాల బీఆర్ఎస్ కౌన్సిర్లు, పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 7వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ నాయక్, 9వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత, 19వ వార్డు కౌన్సిలర్ వంగపల్లి అనిత, 22వ వార్డు కౌన్సిలర్ మేరుగు మహేశ్వరి, 25వ వార్డు కౌన్సిలర్ మీనాజ్, 26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లిమాధవి, 27వ వార్డు కౌన్సిలర్ సిరికొండ పద్మ, 34వ వార్డు కౌన్సిలర్ మాదం శెట్టి సత్యనారాయణతో పాటు BRS పార్టీ నేతలు ఖాజామియా, బోడ ధర్మేందర్, తూముల ప్రభాకర్ తదితర నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. పేద ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా నాయకులు పాటుపడాలని ఆయన కోరారు.