ఆరోగ్యవంతమైన బిడ్డల కోసమే అంగన్వాడీలు
ఐసీడీఎస్ సీడీపీవో విజయలక్ష్మి
ఆరోగ్యవంతమైన బిడ్డల కోసమే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుచేసి పౌష్టికాహారం అందిస్తుందని ఐసీడీఎస్ సీడీపీవో విజయలక్ష్మి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం అశోక్ రోడ్ సెక్టార్లోని రాజీవ్ నగర్ 1 సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని గర్బిణీ, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గర్భిణులకు పలు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రమ, రమేష్, ఆర్పీ స్వప్నిక అంగన్వాడీ టీచర్లు మాధవి, షరీఫా, ఆయా సరోజ పాల్గొన్నారు.