గోదావరిలో మునిగి ఇద్దరు మృతి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బాప్టిజం స్వీకరించేందుకు పాస్టర్ తో కలిసి వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. దండేపల్లి మండలం కొండాపూర్ కు చెందిన అజయ్ (22),గంధం చరణ్ (21) అనే యువకులు బాప్టిజం తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారిని పాస్టర్ పుణ్య స్నానాల కోసం ద్వారక గోదావరి వద్దకు తీసుకువచ్చారు. అజయ్, చరణ్ ఇద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు.