బేర స‌త్య‌నారాయ‌ణ‌ది కోడి క‌త్తి డ్రామా

నాంది, మంచిర్యాల : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై బీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణ ఆరోపణలు ఖండిస్తూ నస్పూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు బాధితులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. భూకబ్జాదారుడు బేర సత్యనారాయణను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసే క్రమంలో ఓ బాధితుడు ఆత్మహత్యయత్యానికి పాల్పడడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ సిరిమిళ్ళ వేణు మాట్లాడుతూ బేర సత్యనారాయణ నస్పూర్ మున్సిపాలిటీలో పేదల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో నాయకులు చేసిన అక్రమాలను ఎండగడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాదితుల పక్షాన ఉండి బాధితులకు న్యాయం చేస్తున్నాడని అన్నారు. సత్యనారాయణను విచారణలో భాగంగా పోలీసులు ఏసీపీ కార్యాలయానికి తీసుకొస్తే ప్లాస్టిక్ కత్తితో కోసుకొని నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు. సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పోలీసులు ప్రజల పక్షాన ఉన్నారని, పోలీసులు బాధితులకు న్యాయం చేస్తారన్నారు. సత్యనారాయణ ను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న బాధితులకు న్యాయం చేస్తామని డీసీపీ భాస్కర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like