రాష్ట్ర చదరంగం పోటీలకు అంబటి అద్విత
ఆదిలాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి అండర్-15 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ లో అంబటి అద్విత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. బాలికల విభాగంలో అంబటి అద్విత జిల్లా చాంపియన్ గా నిలిచారు. అర్చన, సారంగపాణి దంపతుల కుమార్తే అద్విత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది.. ఆమె జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ హైస్కూల్‌లో చదువుకుంటోంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థుల వివరాలను ఆర్గనైజింగ్ సెక్రటరీ నన్నపు స్వామి వెల్లడించారు. బాలుర విభాగంలో జే.కృష్ణ మహిత్ మొదటి స్థానం కైవశం చేసుకున్నారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపీక చేసినట్లు స్వామితెలిపారు. బాలికల విభాగంలో రెండవ స్థానంలో ఏ చైతన్య, మూడో స్థానంలో ఎన్ లక్ష్మి, రాశి కేతన్ నాల్గవ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో జె.కృష్ణ మహిత్, ఫుర్ఖాన్ లు మొదటి రెండు స్థానాల్లో నిలవగా యువ చారి, రామ్ చరణ్ మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు. వీరంతా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాగా. వచ్చే నెల 29న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు.