గాంధీజీ విగ్రహానికి అపచారం
An insult to Gandhi’s statue: తాగిన మత్తులో కొందరు యువకులు చేసిన పనితో గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. నిర్మల్ జిల్లా నీలాయిపేటలో జరిగిన ఈ ఘటనను పలువురు ఖండిస్తున్నారు. నిర్మల్ జిల్లా నీలాయిపేటలో కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా అనంతపేట గ్రామానికి చెందిన కొందరు యువకులు నీలాయిపేటలో మద్యం సేవించారు. గాంధీ విగ్రహం దగ్గర మద్యం సేవించడమే కాకుండా గాంధీజీ విగ్రహం నోట్లో సిగరేట్ ముక్క పెట్టారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఏఎస్పీ రాజేష్ మీనా, సీఐ రామకృష్ణ గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ మేరకు ఎనిమిది యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.