నిర్మ‌ల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. ఇద్ద‌రు అరెస్టు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యాపారి పన్ను మొత్తాన్ని తగ్గించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

పన్ను తగ్గించేందుకు డీసీటీవో గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధిత వ్యాపారి ఏసీబీ అధికారులను సంప్రదించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అనిశా అధికారులు వల పన్ని డీసీటీవో గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణను పట్టుకున్నారు. రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో నిర్మల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో కలకలం రేగింది. లంచం డిమాండ్‌పై పూర్తి వివరాలను అనిశా అధికారులు సేకరిస్తున్నారు.

You might also like