బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత వెంకట కిష్టయ్య అలియాస్ తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. ఆయను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించినట్లు సుల్తాన్ బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు క్రైమ్ నం. 364/2026లో BNS సెక్షన్ 352 r/w 3(5) తో పాటు SC/ST (Prevention of Atrocities) Actలోని సెక్షన్ 3(1)(r), 3(2)(va), 3(2)(vii) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారిని నారాయణగూడ పోలీస్స్టేషన్ తరలించారు. అక్కడ పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఏసీపీ మత్తయ్య ఆధ్వర్యంలో ఈ విచారణ సాగుతోంది. తాతా మధుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తరలిస్తున్నారు. అనంతరం నాంపల్లి 1వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు.