మీ తల్లి అనలేదు… హరీష్ రావ్… నా తల్లిని అన్నరు…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం
మీరు లొల్లి పెడితే నేను భయపడనంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. నిన్న అసెంబ్లీ గేటు వద్ద మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన, తమ పట్ల వారి వ్యవహార శైలిపై నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావు మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవరిస్తున్నారని ఆగ్రహంతో మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ సైతం అదే స్థాయిలో సీరియస్ అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ అంటే నాకు గౌరవమే.. నాకు ఎనిమిది మంది అక్కా, చెల్లెళ్లు… వారితో వీరు కూడా తోబుట్టువులాంటి వారే. జరిగిన ఘటనపై వెంటనే విచారణ చేయాలని చెప్పిన. మీ తల్లిని అనలేదు హరీష్… నా తల్లిని అన్నారు.. దాని గురించి మాట్లాడమంటూ హరీష్‌రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్ అయ్యారు.