విత్త‌న కంపెనీపై చ‌ర్య‌లు తీసుకోండి

విత్త‌న కంపెనీపై చ‌ర్య‌లు తీసుకుని రైతుల‌కు న్యాయం చేయాల‌ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న గురువారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ని కలిసి విన‌తిప‌త్రం అందించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ తలమడుగు మండలం రుయ్యాడిలో విగర్ మాళవిక సొయా విత్తనం సాగు చేసి రైతులు న‌ష్టపోయార‌ని ఎస్పీ దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ మేర‌కు రైతులకు న్యాయం జరిగేలా ఆ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

You might also like