ఏసీబీకి చిక్కిన అటవీశాఖ అధికారి
ACB Raids:ఏసీబీ అధికారుల దాడిలో అటవీ శాఖ ఎఫ్ ఎస్ ఓ చిక్కారు. గురువారం ఖానాపూర్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పి మధు వివరాలు వెల్లడించారు. ఖానాపూర్ పట్టణానికి చెందిన టింబర్ డిపో రెన్యువల్ కు ఎఫ్ ఎస్ ఓ రవీందర్ రూ. 20 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు కామోజీ రవితేజ ముందుగా రూ. 15 వేలు ఆ తర్వాత రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గురువారం వ్యక్తిగతంగా బాధితుడు కామోజీ రవితేజను కలిసి రూ. 12 వేలు లంచం తీసుకుండగా ఎఫ్ ఎస్ వో రవీందర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడి నుండి లంచం డిమాండ్ చేయడంతో, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో దాడి చేసిన ఏసీబీ అధికారులు ఎఫ్ ఎస్ వో రవీందర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖానాపూర్ అటవీ కార్యాలయంలో ఈ దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రభుత్వ అధికారులు సరైన సమాచారం, డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్1064 ను సంప్రదించాలని అన్నారు. అదిలాబాద్ డిఎస్పి మధు ఫోన్ నెంబర్ 9154388963 కు సమాచారం అందించాలని కోరారు.