సరస్వతీ మాత పూజలతో ఆధ్యాత్మిక శోభ..
-అక్షరాభ్యాసాలతో చిన్నారులకు విద్యాభ్యాసానికి శ్రీకారం
-భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు
-అమ్మవారి సన్నిధిలో మహిళల ప్రత్యేక పూజలు
నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తాండూర్లోని శక్తి పంచాయతన క్షేత్రం (శ్రీ వాసవి మాత మందిరం)లో అమ్మవారు సరస్వతీ మాత అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మహిళల కోసం కుంకుమ పూజలు చేపట్టారు. వేద పండితులు దాగం శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, దుర్గాదేవి నవరాత్రులు శక్తి ఆరాధనకు, ఆధ్యాత్మిక చింతనకు, ధర్మమార్గంలో నడిచేందుకు ప్రేరణనిచ్చే పవిత్రమైన రోజులన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బోనగిరి చంద్రశేఖర్, కార్యదర్శి డా. అభినవ సంతోష్ కుమార్, దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు కేశెట్టి విజయకుమార్, గందే నవీన్ కుమార్, కాసం భాస్కర్, పుల్లూరి విఘ్నేష్, గందే శ్రీ సత్యనారాయణ, రాచర్ల మహేష్ కుంకుమ పూజల నిర్వాహకురాలు దాగం మాధవి తదితరులు పాల్గొన్నారు.