ప‌ది రోజుల్లో మ‌రో తుపాను

ముర‌సు తుఫాన్‌కు సంబంధించి విప‌త్తు ఇంకా తొల‌గిపోలేదు… ఒంగోలులో 120 కిలోమీట‌ర్ల వేగంతో తీరం దాటి ఆంధ్రలో విధ్వంసం సృష్టిస్తోంది. అదే స‌మ‌యంలో వాతావ‌ర‌ణ శాఖ మ‌రో హెచ్చ‌రిక జారీ చేసింది. ప‌ది రోజుల్లో మ‌రో తుపాను రానుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 9,10 తేదీల్లో పూర్తి స్ప‌ష్ట‌త రానుంది. ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు తుపాను ఏర్ప‌డుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ తుపాను కూడా నెల్లూరు, చిత్తూరు మ‌ధ్య ఉంటుంద‌ని, దీని ప్ర‌భావం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు త‌మిళ‌నాడుపై కూడా ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది…

ఎల్‌నినో ప్ర‌భావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్ర‌జ‌ల‌కు ఈ తుపానులు మ‌రింత న‌ష్టాన్ని క‌లుగ‌చేస్తున్నాయి. అర్న‌బ్ తుపాను ప్ర‌భావంతో ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు న‌ష్ట‌పోయిన రైతులకు ముర‌సు తుపానుతో ఇంకా న‌ష్టం క‌లుగుతోంది. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రో తుపాను అంటే రైతులు కుదేల‌వ్వ‌డం ఖాయం… ఈ ఏడాది న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్‌లో వ‌రుస తుపానులు ఉండే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అంచనా వేస్తోంది.

You might also like