ఇల్లు ఖాళీ చేయండి…
కాంగ్రెస్ నేత రాహుల్కు నోటీసులు
Rahul Gandhi: కొద్ది రోజుల క్రితమే అనర్హత వేటుతో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయనకు కేటాయించిన అధికారిక బంగళా ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు అందించారు. ప్రభుత్వం కేటాయించిన బంగ్లా 30 రోజుల్లో ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. 12-తుగ్లక్ లేన్లో రాహుల్ నివాసం ఉంటున్నారు. 2004 నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. పరువునష్టం కేసులో మార్చి 23న సూరత్ జిల్లా కోర్టు దోషిగా నిర్దారించడం రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద రాహుల్ గాంధీ అనర్హత వేటు ఎదుర్కొన్నారు. తన ఎంపీ పదవి పోవడంతో ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం గమనార్హం.