గుంతలు పూడ్చి… నిరసన తెలిపి…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముఖరాంచౌరస్తా నుంచి హమాలీవాడకు వెళ్లే మార్గంలోని అండర్‌బ్రిడ్జి వద్ద ఏర్పడిన గుంతలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వయంగా పూడ్చారు. అండర్‌బ్రిడ్జి వద్ద గుంతలు ఏర్పడి చాలా రోజులైనా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో 2 టౌన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గుంతలను పూడ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి 2 టౌన్ ప్రాంత ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

You might also like