నాకో న్యాయం…? రెడ్లకో న్యాయమా..?
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
చాలామంది రెడ్డి నాయకులు బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు… మరి వారిపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు… బీసీ వర్గానికి చెందిన నాపై మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు… నాపై ఏమైనా చర్యలు తీసుకోవాలని చూస్తే రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై తిరగబడతారని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం ఆమె మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ఎలా చెప్పుకుంటారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క భార్యపై కమిషన్ల ఆరోపణలు, లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చినా ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదని ఆమె విరుచుకుపడ్డారు. కేబినెట్లోని చాలామంది మంత్రులు, సీనియర్ నేతలు ప్రభుత్వ పోకడలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని సురేఖ వ్యాఖ్యానించారు.
తన కుమార్తె మాట్లాడిన విషయానికి తనను ఎందుకు బాధ్యురాలిని చేస్తారని సురేఖ ప్రశ్నించారు. మహిళలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెబుతుంటే, నా బిడ్డ మాట్లాడిన దానికి నాపై ఎందుకు శిక్ష వేస్తారని నిలదీశారు.