తెలంగాణ ఉద్య‌మ కారుల‌కు స‌న్మానం

బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను, ఉద్యమకారుల పోరాట పటిమను, త్యాగాలను స్మరించుకున్నారు. ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయమని దుర్గం చిన్నయ్య కొనియాడారు.

 

You might also like